కారు క‌డుగుతుండ‌గా యువ‌కుడికి గుండెపోటు

అకస్మాత్తుగా గుండెపోటుతో యువకులు చ‌నిపోతున్న ఘ‌ట‌నలు ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి

కారు క‌డుగుతుండ‌గా యువ‌కుడికి గుండెపోటు
  • నేల‌పై ఒక్క‌సారిగా ప‌డిపోయిన యువ‌కుడు
  • సీసీటీవీ కెమెరాలో రికార్డు..
  • సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌


విధాత‌: అకస్మాత్తుగా గుండెపోటుతో యువకులు చ‌నిపోతున్న ఘ‌ట‌నలు ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకున్న‌ది. ఓ యువకుడు త‌న ఇంటి బ‌య‌ట కారు కడుక్కుంటూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పో్స్టుచేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.


డిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జోయా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్న‌ది. సోమ‌వారం తెల్లవారుజామున ఆ యువకుడు వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కారును శుభ్రంగా నీటితో క‌డుగుతున్నాడు. అయితే ఆ కారు యువకుడిదేనా.. లేక అతడు క్లీనర్ అనే విషయంపై స్పష్టత రాలేదు. ఆ యువకుడు కారును కడుక్కుంటూ ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. స్థానికులు గ‌మ‌నించి స‌మీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే యువ‌కుడు చ‌నిపోయిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు.