Marriage Age | పెళ్లికి ప‌ర్‌ఫెక్ట్ ఏజ్ తెలుసా..? ఈ ఐదింటిలో ఏ వ‌య‌సు స‌రైంది..?

Marriage Age | మీరు పెళ్లి( Marriage ) చేసుకోవాల‌నుకుంటున్నారా..? మ‌రి ఏ ర‌క‌మైన వివాహం చేసుకోవాల‌నుకుంటున్నారు..? ఒక్కో ర‌క‌మైన పెళ్లిని ఒక్కో వ‌య‌సులో చేసుకోవ‌చ్చు. మ‌రి మీరు ఏ ర‌క‌మైన వివాహం చేసుకోవాల‌నుకుంటున్నారు.. అయితే ఓసారి ఈ చార్ట్‌పై లుక్కేయండి మ‌రి..

Marriage Age | పెళ్లికి ప‌ర్‌ఫెక్ట్ ఏజ్ తెలుసా..? ఈ ఐదింటిలో ఏ వ‌య‌సు స‌రైంది..?

Marriage Age | పెళ్లి( Marriage ).. ఈ రెండు అక్ష‌రాల ప‌దం విన‌గానే కొంద‌రిలో ఏదో తెలియ‌ని ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మ‌రికొంద‌రిలో పెళ్లే క‌దా అని పెద‌వి విరుస్తారు. ఇంకొంద‌రేమో వామ్మో పెళ్లా.. నాకొద్దంటూ ప‌రుగెడుతుంటారు. కానీ చాలా కుటుంబాల్లో యువ‌తీయువ‌కుల వ‌య‌సును బ‌ట్టి పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అయితే ఓ నెటిజ‌న్ పెళ్లిళ్ల‌పై ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని పంచుకున్నాడు. అదేంటంటే.. పెళ్లి చేసుకునేందుకు ప‌ర్‌ఫెక్ట్ ఏజ్ తెలుసా..? అని ప్ర‌శ్నించాడు. ఒక ఐదు ఆప్ష‌న్లు ఇస్తున్నాను.. ఇందులో ఏ వ‌య‌సు పెళ్లికి క‌రెక్ట్ చెప్పాలంటూ ప్ర‌శ్న సంధించాడు.

Biologically: 15
Socially: 26
Legally: 18+
Culturally: 24- 28
Economically: 30+
ఇక చివ‌ర‌కు
Logically: NEVER అని రాసుకొచ్చాడు.

ఈ చార్ట్ చూసిన త‌ర్వాత చాలా మంది లాజిక‌ల్లి అదే నెవ‌ర్‌ను ఎంచుకున్నారు. పెళ్లి చేసుకోక‌పోవ‌డమే బెట‌ర్ అని రాసుకొచ్చారు. ఒక వేళ పెళ్లి చేసుకోవాల‌నుకుంటే పెళ్లాం పెట్టే ఒత్తిడికి సిద్ధ‌ప‌డి, ఈఎంఐలు చెల్లించేందుకు రెడీగా ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని మ‌రో నెటిజ‌న్ చ‌మ‌త్క‌రించాడు.