వృక్ష రక్షణి కాదు వృక్షనాశని…చెట్ల ప్రపంచ సగటు 422, ఇండియా సగటు 28
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వాతావరణం ప్రమాదకరంగా మారుతున్నదని ప్రభుత్వం తర్వాత ప్రభుత్వాన్ని, తరం తర్వాత తరాన్ని నిందించుకుంటూ కూర్చుంటే లాభం

విధాత- ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వాతావరణం ప్రమాదకరంగా మారుతున్నదని ప్రభుత్వం తర్వాత ప్రభుత్వాన్ని, తరం తర్వాత తరాన్ని నిందించుకుంటూ కూర్చుంటే లాభం లేదని ఇప్పటికే మనం పర్యావరణ పరిరక్షణ యుద్ధంలో ఓడిపోయామని తృణమూల్ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఐఎఎస్ జవహర్ సర్కార్ పేర్కొన్నారు.
ప్రపంచంలో ప్రతి మనిషికి సగటున 422 చెట్లు ఉంటే మన దేశంలో 28 చెట్లు మాత్రమే మిగిలాయని ఆయన ఆదివారం నాడు ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతిమనిషికి సగటున కెనడాలో 10163 చెట్లు ఉండగా, ఆస్ట్రేలియాలో 3266 చెట్లు, అమెరికాలో 699 చెట్లు, చైనాలో 130 చెట్లు ఉన్నాయని, ఇథియోపియాలో కూ 143 చెట్లు ఉన్నాయని ఆయన వివరించారు. అడవులను సంరక్షించడం, చెట్లను విస్తృతంగా పెంచడం చేయకపోతే రానున్నకాలంలో వాతవరణం మరింత ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.