Girlfriend On Rent | అబ్బాయిల‌కు బంపరాఫ‌ర్.. అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్.. బైక్ రైడ్ అయితే రూ. 4 వేలు..!

Girlfriend On Rent | అద్దె ఇండ్లు, ఆఫీసులు చూశాం. కార్లు అద్దెకు తీసుకెళ్ల‌డం చూశాం. ఇత‌ర‌త్రా సామాన్లు కిరాయికి తీసుకెళ్ల‌డం చూశాం. కానీ ఓ అమ్మాయి సింగిల్స్‌గా ఉన్న అబ్బాయిల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్ అంటూ ఇన్‌స్టాలో ఓ రీల్ చేసింది. త‌న‌తో డేటింగ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించింది.

Girlfriend On Rent | అబ్బాయిల‌కు బంపరాఫ‌ర్.. అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్.. బైక్ రైడ్ అయితే రూ. 4 వేలు..!

Girlfriend On Rent | అద్దె ఇండ్లు, ఆఫీసులు చూశాం. కార్లు అద్దెకు తీసుకెళ్ల‌డం చూశాం. ఇత‌ర‌త్రా సామాన్లు కిరాయికి తీసుకెళ్ల‌డం చూశాం. కానీ ఓ అమ్మాయి సింగిల్స్‌గా ఉన్న అబ్బాయిల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్ అంటూ ఇన్‌స్టాలో ఓ రీల్ చేసింది. త‌న‌తో డేటింగ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించింది. త‌న డేటింగ్ ప్లాన్స్‌ను రూ. 1500తో ప్రారంభించి రూ. 10 వేల వ‌ద్ద ముగించింది ఆమె. ఆ అద్దె గ‌ర్ల్ ఫ్రెండ్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఎవ‌రీ అద్దె గ‌ర్ల్ ఫ్రెండ్..?

దివ్య గిరి పేరిట ఆమె ఇన్‌స్టాలో ఖాతా తెరిచింది. ద‌క్షిణ ఢిల్లీలో ఉంటున్న‌ట్టు ఆమె పేర్కొంది. పూర్తిగా శాఖాహారిని అని పేర్కొంది. నార్మ‌ల్ కాఫీ డేట్ నుంచి వీకెండ్ గేట్ వేస్ వ‌ర‌కు ఆమె త‌న రీల్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఏ డేట్‌కు ఎంత అద్దె చెల్లించాల్నో వివ‌రంగా తెలిపింది ఆమె. త‌న‌ను ఒక రోజు అద్దెకు తీసుకోండి.. మ‌ధుర‌మైన స్మృతుల‌ను మ‌దిలో ఉంచుకోండి.. అంటూ ఆమె రాసుకొచ్చింది.

డేటింగ్ వివ‌రాలు ఇవే..

చిల్ కాఫీ డేట్ రూ. 1500
నార్మ‌ల్ డేట్(డిన్న‌ర్ అండ్ మూవీ) రూ. 2 వేలు
మీటింగ్ విత్ ఫ్యామిలీ రూ. 3 వేలు
ఈవెంట్ కంపానియ‌న్ రూ. 3500
బైక్ డేట్(హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్) రూ. 4 వేలు
ప‌బ్లిక్ పోస్ట్ అబౌట్ అవ‌ర్ డేట్ రూ. 6 వేలు
అడ్వెంచ‌ర్ డే(హైకింగ్, కాయ‌కింగ్ ఎక్సెట్రా) రూ. 5వేలు
కూకింగ్ టుగెద‌ర్ ఎట్ హోమ్ రూ. 3500
షాపింగ్ స్ప్రీ రూ. 4500
వీకెండ్ గేట్‌వే(2 డేస్) రూ. 10 వేలు
ఇంకా మీ మ‌దిలో నిర్దిష్టంగా ఇంకేమైనా ఉందా..? మీ కోసం మాత్రమే సరైన రోజును ప్లాన్ చేద్దాం..! అంటూ దివ్య గిరి పేర్కొంది.