అహ్మదాబాద్: గుజరాత్ లో గార్భా డాన్స్ విషాదం నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ హుషారుగా డ్యాన్స్ చేస్తున్న యువత ఉరిమే ఉత్సాహాం వారి ఊపిరితీసినట్లయ్యింది. గార్భా డ్యాన్స్ శబ్ధాలకు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గార్భా డ్యాన్స్ బాగా ప్రసిద్ధి చెందిన డ్యాన్సులలో ఇదొకటి. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్, ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున ఆనందంతో గార్భా డ్యాన్స్ లు చేస్తుంటారు. ఈసారి కూడా ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా జోరుగా నిర్వహిస్తున్నారు.
అయితే ఆ రాష్ట్రంలో గార్భా డ్యాన్సలో పాల్గొన్నవారు వేర్వేరు ప్రదేశాల్లో పదిమంది గుండెపోటుతో మరణించారు. చనిపోయిన వారిలో పిల్లలు, పెద్దలు, మధ్య వయస్సు వారు కూడా ఉన్నారు. వీరంతా ఈ డాన్సు సందర్భంగా హార్ట్ఎటాక్ తోనే చనిపోవడం అందరి దృష్టిని అటువైపు మరల్చింది. అసలు ఈ గార్భా డ్యాన్సుల్లో పాల్గొనడమా? లేదా? అనే సంశయాన్ని ప్రజల్లో రేకెత్తించింది. గుజరాత్ గార్భా డ్యాన్స్ కు పుట్టినిల్లు. ఆనంద్ లో గార్భా డాన్సులో పాల్గొన్న ఒక యువకుడు అలసిపోవడంతో, ఆక్సిజన్ సరిపడా అందక కుప్పకూలి మరణించాడు.
ఇలా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఉంటుంది. మరొక సమస్య డీజే ద్వారా ఉపయోగించే హై బీట్ డ్రమ్స్ మిగతా సంగీత పరికరాలు అత్యంత ఎక్కువ సౌండ్స్ నిస్తాయి. వీటి ద్వారా ఎక్కువసేపు ఇటువంటి ఒత్తిడి వాతావరణంలో ధనుల మధ్య ఉండడం వలన హార్ట్ యొక్క ఫంక్షనింగు క్రమంగా నెమ్మదించడం ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది సాధారణంగా గుండెకు సంబంధించిన ఏ సమస్యలు లేని వారికి కూడా ఈ పరిస్థితి కలిగే ప్రమాదం ఉంది.
గుండె సమస్యలు ఉన్న వారికి ఈ డ్యాన్స్‌తో ఎక్కువ గుండెపోటు అవకాశాలు ఉన్నాయి. అందువల్ల గార్భా డ్యాన్స్ లో హార్ట్ ఎటాక్ తో చనిపోవడానికి వైద్య నిపుణులు తాజాగా ప్రాథమికంగా ఈ కారణాలను చూపుతూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వీటి నుండి బయటపడడానికి డ్యాన్స్ చేసే సందర్భాల్లో మధ్య మధ్యలో విరామాలు తప్పక పాటించాలి బీట్స్ యొక్క సౌండ్స్ ను తగ్గించాలి. ఈ విధమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ ప్రమాదాలను తగ్గించ కోవచ్చు.