Anmol | ఆ దున్న‌పోతు ఖరీదు అక్ష‌రాలా రూ. 23 కోట్లు..! దాని వీర్యానికి కూడా భ‌లే డిమాండ్..!!

Anmol | మూగ జీవాలైన ప‌శువుల‌ను చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ కొంద‌రు మాత్రం ఆ ప‌శువుల‌ను( Cattles ) ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. సొంత బిడ్డ‌ల్లా కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. తిండికి కూడా ఏ మాత్రం కొద‌వ లేకుండా.. పౌష్టికాహారాన్ని ఆ ప‌శువుల‌కు అందిస్తుంటారు.

Anmol | ఆ దున్న‌పోతు ఖరీదు అక్ష‌రాలా రూ. 23 కోట్లు..! దాని వీర్యానికి కూడా భ‌లే డిమాండ్..!!

Anmol | మూగ జీవాలైన ప‌శువుల‌ను చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ కొంద‌రు మాత్రం ఆ ప‌శువుల‌ను( Cattles ) ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. సొంత బిడ్డ‌ల్లా కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. తిండికి కూడా ఏ మాత్రం కొద‌వ లేకుండా.. పౌష్టికాహారాన్ని ఆ ప‌శువుల‌కు అందిస్తుంటారు. ఇలా చాలా మంది రైతులు ప‌శువుల‌ను పెంచుకుంటుంటారు.

అలా అపురూపంగా పెంచుకున్న ఓ దున్న‌పోతు.. పుష్క‌ర్ మేళా( Pushkar Mela )తో మీర‌ట్‌లో నిర్వ‌హించిన ఆలిండియా ఫార్మ‌ర్స్ ఫెయిర్‌( All India Farmers Fair )లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. హ‌ర్యానా( Haryana )కు చెందిన గిల్( Gill ) అనే రైతు ఈ దున్న‌పోతును పెంచుకుంటున్నాడు. 8 ఏండ్ల వ‌య‌సున్న ఈ దున్న‌కు అన్మోల్( Anmol ) అని నామ‌క‌ర‌ణం చేశాడు. దీని బ‌రువు 1500 కిలోలు కాగా, ఖ‌రీదు మాత్రం రూ. 23 కోట్లు. పుష్క‌ర్ మేళాలో ఈ దున్న‌పోతు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ దున్న‌తో ఎగ‌బడి సెల్ఫీలు దిగారు.

అన్మోల్‌కు ప్ర‌తి రోజు రూ. 1500 దాకా ఖ‌ర్చు పెడుతుంటారు. డ్రై ఫ్రూట్స్‌( Dry Fruits )ను ఆహారంగా ఇస్తుంటారు. ప్ర‌తి రోజు 250 గ్రాముల బాదం, నాలుగు కిలోల దానిమ్మ పండ్లు, 30 అర‌టి పండ్లు( Banana ), ఐదు కేజీల పాలు, 20 కోడిగుడ్లతో పాటు ఆయిల్ కేక్, ప‌చ్చ‌గ‌డ్డి, ఆవు నెయ్యి, సోయాబీన్స్, మ‌క్క పిండిని ఆహారంగా వ‌డ్డిస్తారు. ఇక రోజుకు రెండు సార్లు.. బాదం, ఆవాల నూనె క‌లిపి స్నానం చేయిస్తారు.

అన్మోల్ వీర్యానికి కూడా భ‌లే డిమాండ్..

దున్న‌పోతు అన్మోల్ వీర్యానికి( Anmol Semen ) కూడా భ‌లే డిమాండ్ ఉన్న‌ట్లు య‌జ‌మాని గిల్ తెలిపాడు. రోజుకు రెండుసార్లు వీర్యాన్ని సేక‌రిస్తారు. వీర్యాన్ని విక్ర‌యించ‌డం ద్వారా ప్ర‌తి నెల రూ. 5 ల‌క్ష‌ల దాకా ఆదాయం వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఈ ఆదాయం దున్న నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు స‌రిపోతుంద‌న్నాడు.