అడ్వెంచర్ బైక్‌ను లాంచ్ చేయబోతున్న హీరో..! ఫీచర్స్ ఏంటో చూసేద్దాం రండి..!

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ సరికొత్తగా బైక్‌ను లాంచ్ చేయబోతున్నది. దీనికి హీరో ఎక్స్‌పల్-400గా నామకరణం చేసింది. ఈ మోడల్‌కు సంబంధించి వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. బైక్‌కు సంబంధించి ఇటీవల టెస్ట్ డ్రైవ్ జరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, బైక్‌కు సంబంధించిన వివరాలు కొన్ని బయటకువచ్చాయి. అవేంటో చూసేద్దాం రండి..!
అడ్వెంచర్ బైక్..
హీరో ఎక్స్‌పల్స్-400 అడ్వెంచర్ బైక్‌గా తెలుస్తున్నది. 350సీసీ- 400సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రావచ్చని సమాచారం. ఇంజిన్ 35 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుందని, మిడ్‌రేంజ్ టార్క్ అవుట్‌పుట్ లభించే ఛాన్స్ ఉంది. టెస్ట్ డ్రైవ్‌లో సమయంలో ఫ్రెంట్ సైడ్ ఇన్వర్టెడ్ ఫోర్క్స్, రేర్‌లో ప్రీలోడ్ అడ్జెస్టెబుల్ మోనో షాక్ అబ్సార్బర్స్ కనిపించాయి. రగ్డ్ స్పోక్డ్ వీల్స్, ట్యూబ్ టైప్ టైర్స్ బైక్ రానున్నది సమాచారం. అయితే, ఇప్పటికే హీరో ఎక్స్‌పల్ బైక్ మార్కెట్‌లోకి రావాల్సి ఉందని.. పలు కారణాలతో ప్రాజెక్టు ఆలస్యమైందని సంబంధితర వర్గాలు వెల్లడించాయి.
వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి..
ఇటీవల కాలంలో ప్రాజెక్టు వేగంగా కొనసాగుతున్నదని.. 2024 చివరి నాటికి మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ బైక్‌కు సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధరకు సంబంధించి క్లారిటీ రాలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. మరో వైపు కంపెనీ ఎక్స్‌పల్-210 బైక్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేసేందుకు హీరో కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌లో ఉన్న 210 సీసీ ఇంజిన్‌తో రానున్నట్లు టాక్.