Supreme Court | రైతుల సమస్యలపై బహుళ కమిటీ..సుప్రీం కోర్టు వెల్లడి

రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది

Supreme Court | రైతుల సమస్యలపై బహుళ కమిటీ..సుప్రీం కోర్టు వెల్లడి

విధాత, హైదరాబాద్ : రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కోరింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తెలిపింది. హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసన తెలుపుతున్న రైతులతో తాము సమావేశం నిర్వహించామని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది. అంతేకాక, జాతీయరహదారిపై ఏర్పాటుచేసిన బారికేడ్లను పాక్షికంగా తొలగించేందుకు అంగీకరించినట్లు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైతు ఉద్యమం సందర్భంగా చలో ఢిల్లీని అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని వారంలోగా తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.