జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష
వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (నీట్-యూజీ) రీఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీ (నీట్-యూజీ) రీఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జూన్ 21న ఆదివారం మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల కారణంగా ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు, తల్లిదండ్రుల వినతుల మేరకు నీట్ రీ ఎగ్జామ్ తేదీలను ఎన్టీఏ వెల్లడించింది.
నీట్ యూజీ 2026కు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీకవ్వడం..దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ యూజీ 2026ను ఎన్‌టీఏ రద్దు చేసింది. అయితే నీట్ పేపర్ లీక్, రద్దు పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
జూన్ 14న నీట్ యూజీ అడ్మిట్ కార్డులు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు రాగానే విచారణకు ఆదేశించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదనే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తాం. 21న నీట్ యూజీ రీఎగ్జామ్ జరుగుతుంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రధాన కర్తవ్యం. ఇటీవల నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అయ్యిందనే విషయం త్వరలో బహిర్గతమవుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేపర్ లీక్ చేసిన వారు ఎవరైనా..అందులో ఎన్టీఏ వారు ఉన్నా.. కఠిన చర్యలు తీసుకుంటాం అని ధర్మేంద్ర అన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష!
వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. పేపర్ లీక్ తో తప్పు జరిగిందని, అవి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై కసరత్తు జరుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి :
జనానికే పొదుపు సుద్దులు..విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
మోదీ షాక్…పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram