Plane wings | ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే వడగండ్ల వాన.. ఏం జరిగిందంటే..!

Plane wings | విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్‌ చాకచక్యంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విస్తారా ఎయిర్‌ లైన్స్‌ విమానం 170 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది.

Plane wings | ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే వడగండ్ల వాన.. ఏం జరిగిందంటే..!

Plane wings : విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్‌ చాకచక్యంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విస్తారా ఎయిర్‌ లైన్స్‌ విమానం 170 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది.

అయితే విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కాసేపటికే ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్మి వడగండ్ల వాన మొదలైంది. దాంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఇది గమనించిన పైలట్‌ వెంటనే భువనేశ్వర్‌ విమానాశ్రయం అధికారులకు సమాచారమిచ్చారు. అధికారుల సూచన మేరకు విమానాన్ని వెనక్కి తిప్పి రన్‌వేపై సురక్షితంగా దించేశారు.

దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయం డైరెక్టర్‌ ప్రసన్న ప్రధాన్‌ విలేకరులతో మాట్లాడుతూ పైలట్‌ సమయస్ఫూర్తి వల్లే ప్రమాదం తప్పిందన్నారు. ప్రయాణికులను విస్తారా సంస్థకు చెందిన మరో విమానంలో ఢిల్లీకి పంపినట్లు తెలిపారు.