గిఫ్ట్‌తో.. తల్లిని ఆశ్చర్యపరిచిన రాహుల్‌గాంధీ

గిఫ్ట్‌తో.. తల్లిని  ఆశ్చర్యపరిచిన రాహుల్‌గాంధీ

విధాత : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ తల్లి సోనియాగాంధీకి ఊహించని గిఫ్ట్‌ను అందించి ఆశ్చర్యపరిచారు. కొడుకు ప్రేమతో ఇచ్చిన ఆ గిఫ్ట్‌ను స్వీకరించిన సోనియా ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో దేశంలో విసృతంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ, తరుచు విదేశాల్లోనూ పర్యటిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం బిజీగా ఉంటున్నారు.


ఈ క్రమంలో తాజాగా తల్లిని కలిసిన రాహుల్ ఆమెకు కుక్కపిల్లను గిఫ్ట్‌గా అందించి ఆశ్చర్యపరిచారు. కుక్కపిల్లను గిఫ్ట్‌గా అందుకున్న సోనియాగాంధీ దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి ముద్దు చేస్తూ సందడి చేశారు. నిరంతరం రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే సోనియాగాంధీకి కుక్కపిల్లతో గడిపే సమయం కొంత ఆటవిడుపుగా ఉంటుందని భావిస్తున్నారు.