రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబాతాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాజస్థాన్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభ్యర్థుల జాబితాను షేర్ చేశారు

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడి

విధాత : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబాతాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాజస్థాన్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభ్యర్థుల జాబితాను షేర్ చేశారు. ఈ లిస్టులో 33 మంది కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ సర్దార్పుర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ టొంకు నియోజకవర్గం నుండి టికెట్‌ ఇచ్చారు.


ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ తోటసరాకు లక్ష్మణ్ గార్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇచ్చారు. ఇంకా జోహార్ నియోజకవర్గ నుంచి భాటి, సాదుల్పూర్ నుంచి కృష్ణాపూర్యాన్ ,గాడ్ ఎస్సీ రిజర్వ్‌డ్‌లో మనోజ్ మెగా, మండవ నుంచి రీతా చౌదరి, విరాట్ నగర్ నుంచి ఇంద్రజ సింగ్, సంగానోయర్ నుంచి పుష్పెంద్ర భరద్వాజ్ , మండవా నుంచి లలిత్ కుమార్ యాదవ్, గ్రామీణ నియోజకవర్గం నుంచి సీతారాం, జూలీ నియోజకవర్గం నుంచి మమతా భూపేష్ సవాయి, మాదాపూర్ నుంచి మంజు దేవి, దిగానా నుంచి విజయపాల్, భరత్ నియోజకవర్గం నుంచి రామ్ నివాస్ గవార్య, ఓసియన్ నుంచి దివ్య మధిరనా, జ్యోతి పూర్ నుంచి మనీషా తన్వార్లకు టికెట్లు ఇచ్చారు.


రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న గ్రూప్‌ తగాదాలతోనే ఇప్పటిదాకా ఆ పార్టీ తొలిజాబితా కూడా వెల్లడించలేకపోతుంంటూ బీజేపీ విమర్శించింది. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ మొదటి లిస్టు రావటంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రచారం జోరందుకోనుంది.