Ranya Rao: కన్నడ హీరోయిన్ రన్యారావు పెళ్లిలో ట్విస్ట్
పెద్దమొత్తంలో బంగారాన్ని దుబాయి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కన్నడ సినీ హీరోయిన్ రన్యారావు విషయంలో రోజుకో ట్విస్ట్ అన్నట్టుంది. ఇప్పుడు తాజా ట్విస్ట్ ఆమె పెళ్లి విషయం. కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె అయిన రన్యారావు తనకు పెళ్లయిందని, జతిన్ హుక్కేరి తన భర్త అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే..

Ranya Rao: పెద్దమొత్తంలో బంగారాన్ని దుబాయి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కన్నడ సినీ హీరోయిన్ రన్యారావు విషయంలో రోజుకో ట్విస్ట్ అన్నట్టుంది. ఇప్పుడు తాజా ట్విస్ట్ ఆమె పెళ్లి విషయం. కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె అయిన రన్యారావు తనకు పెళ్లయిందని, జతిన్ హుక్కేరి తన భర్త అని చెప్పిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత రన్యారావు తమతో టచ్‌లో లేదని ఆమె తండ్రి చెబుతున్నారు.
రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఆమెతో ఉన్న సంబంధాల కారణంగా తనపైనా అరెస్టు వారెంట్ జారీ అవుతుందని భావించిన హుక్కేరి.. తనను అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. తాము వేరుపడినందున తనను అరెస్టు నుంచి మినహాయించాలని హుక్కేరి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. తదుపరి విచారణ వరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని డీఆర్ ఐ అధికారులను ఆదేశించింది. ఈలోపు తన అభ్యంతరాలను డీఆర్ ఐ దాఖలు చేయనున్నది. రన్యారావును తన క్లయింట్ నవంబర్‌లో వివాహం చేసుకున్నప్పటికీ.. వివిధ కారణాల రీత్యా అనధికారికంగానే అయినా డిసెంబర్ నుంచి విడిగా ఉంటున్నాడని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై వచ్చే మంగళవారం తమ అభ్యంతరాలను దాఖలు చేస్తామని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధురావు తెలిపారు. తదుపరి విచారణను మార్చి 24న చేపట్టనున్నట్టు హైకోర్టు ప్రకటించింది. దుబాయి నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ మార్చి 3వ తేదీన బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డీఆర్ ఐ అధికారులకు రన్యారావు దొరికిపోయిన విషయం తెలిసిందే. కాగా.. కింది కోర్టు బెయిల్‌ను నిరాకరించడంతో ఆమె శనివారం తాజాగా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.