కర్నాటక ఐటీ దాడుల్లో సంచలనం.. 94 కోట్ల నగదు

కర్నాటక ఐటీ దాడుల్లో సంచలనం.. 94 కోట్ల నగదు
  • 8కిలోల బంగారం.. కోట్ల వాచ్‌లు


విధాత: కర్ణాటక రాష్ట్రంలో ఐటీ దాడుల్లో సంచలన రీతిలో భారీ నగదు పట్టుబడుతున్న తీరు విస్మయం రేపుతోంది. ఓ కాంట్రాక్టర్‌ ఇంట్లో 94కోట్ల నగదు. 8కిలోల బంగారం, కోట్ల విలువ చేసే వాచ్‌లు పట్టుబడ్డాయి. కర్ణాటకలో వరుసగా కాంట్రాక్టర్ల ఇళ్లలోని 42కోట్లు, 45కోట్లు పట్టుబడగా, ఇప్పుడు అంతకుమించి నగదు, నగలు ఐటీ దాడుల్లో పట్టుబడిన తీరు చర్చనీయాంశమైంది. ఈ డబ్బు అంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తరలించేందుకేనా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.