జాలర్లను విడిపించండి..విదేశాంగ మంత్రికి స్టాలిన్ లేఖ
అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమించి తమ దేశ జలాల్లోకి ప్రవేశించారన్నఆరోపణలతో అరెస్ట్ అయిన జాలర్లను విడిపించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. శ్రీలంక నేవీ అరెస్టు చేసిన తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను, వారి పడవలను విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని మన్నార్ సమీపంలో జాలర్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి మర పడవలను శ్రీలంక నేవీ స్వాధీనం చేసుకుందని స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక చెరలో 68 మంది భారత జాలర్లు, 235 పడవలు ఉన్నాయని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. వెంటనే జాలర్లను, వారి పడవలను తక్షణమే విడిపించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.