న్యూఢిల్లీ: హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లలో బస చేసే విదేశీయులకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అందించాలని వాటి నిర్వహాకులకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
గదులు కేటాయించే సమయంలో సేకరించిన వివరాలను ఫామ్ సీలో పొందుపర్చి 24 గంటల్లోపు రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది. వాటిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని వెల్లడించింది. ఇది హోటళ్లతోపాటు బోర్డింగ్ హౌస్‌లు, క్లబ్, డాక్ బంగ్లా, రెస్ట్ హౌస్, హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ హౌస్, సరాయ్, రెంటెండ్ అకామిడేషన్, హాస్పిళ్లకు కూడా వర్తిస్తుంది వెల్లడించింది.
అదేవిధంగా మత సంబంధమైన సంస్థ, చారిటబుల్ ట్రస్టులు, ఇతర ట్రస్టులు, పబ్లిక్ ఆర్గనైజేషన్లు కూడా తప్పనిసరిగా ఈ వివరాలను అందించాలని పేర్కొంది. దీనిని అధిగమించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.