Lion Skydiving | అన్‌బిలివబుల్ స్టంట్.. సింహంతో స్కైడైవింగ్.. వీడియో
Lion Skydiving | ఇతర జంతువులే( Animals ) కాదు.. మనషులను వేటాడే క్రూర మృగం సింహం( Lion ). అలాంటి సింహం.. ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతమైన స్టంట్( Unbelievable Stunt ) చేసింది. అది కూడా గాల్లో ఎగిరి.. మనషుల మాదిరే స్కైడైవింగ్( Lion Skydiving ) చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Lion Skydiving | అడవి రారాజు అయిన మృగరాజు సింహం( Lion )తో స్కైడైవింగ్( Skydiving ) ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు చదువుతున్నది నిజమే.. ఓ సింహం గాల్లో తేలియాడుతూ స్కైడైవింగ్ చేసింది. స్కైడైవర్( Skydiver ) తనకు సింహాన్ని కట్టుకుని గాల్లో ఎగిరిపోయాడు. సింహం కూడా ఏ మాత్రం భయపడకుండా గాల్లో విహరించి.. స్కైడైవింగ్ ఎంతో తేలికన్నట్టు నిరూపించింది.
ఈ వీడియోలో సింహం గాలిల్లో విహరిస్తూ.. తన కాళ్లను విస్తరించి.. థ్రిల్‌లో మునిగిపోయినట్లు అనిపిస్తుంది. స్కైడైవింగ్ చేసిన సింహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వేల అడుగులో ఎత్తులో సింహం స్కైడైవింగ్ చేసిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో ప్రామాణికతను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సింహం నిజంగానే స్కైడైవింగ్ చేసిందా..? లేకా ఏఐ సృష్టినా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను @travelling.shillong అనే ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్టు చేశారు. అయితే ఏ ప్రాంతంలో ఈ స్కైడైవింగ్ చేశారనే విషయంపై కూడా స్పష్టత లేదు.
View this post on Instagram