Murder Attempt | బతికుండగానే భర్తను పూడ్చిపెట్టేందుకు యత్నించిన భార్య
Murder Attempt | భర్త( Husband )తో ఏర్పడ్డ విబేధాల కారణంగా అతను బతికుండగానే పూడ్చి పెట్టేందుకు యత్నించింది ఓ భార్య( Wife ). కానీ అదే సమయానికి అటుగా ఓ వ్యక్తి రావడంతో.. అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

Murder Attempt | లక్నో : భర్త( Husband )తో ఏర్పడ్డ విబేధాల కారణంగా అతను బతికుండగానే పూడ్చి పెట్టేందుకు యత్నించింది ఓ భార్య( Wife ). కానీ అదే సమయానికి అటుగా ఓ వ్యక్తి రావడంతో.. అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradeshలోని బరేలీ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీ జిల్లాకు చెందిన రాజీవ్( Rajiv )కు సాధన( Sadhana ) అనే మహిళతో 2009లో వివాహమైంది. వీరికి 14, 8 ఏండ్ల వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జులై 21వ తేదీన రాజీవ్‌ను చంపేందుకు సాధన కుట్ర చేసింది. తన సోదరులను ఇంటికి పిలిపించి.. రాజీవ్‌పై దాడి చేయించింది. అనంతరం బరేలీ అడవుల్లోకి రాజీవ్‌ను తీసుకెళ్లారు. అతను బతికుండగానే అడవుల్లో పూడ్చిపెట్టేందుకు యత్నించారు. కానీ అప్పుడే ఒక వ్యక్తి రావడంతో అటు నుంచి సాధనతో పాటు మిగతావారు పారిపోయారు. ప్రస్తుతం రాజీవ్ కోలుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ.. తనపై భార్య సాధనతో పాటు మరో 11 మంది ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు కాళ్లు, ఒక చేయి పూర్తిగా విరిగిపోయాయి. ఆ తర్వాత తనను సీబీ గంజ్ ఏరియాలోని అడవుల్లోకి తీసుకెళ్లారు. ఓ గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టేందుకు యత్నించారు. అప్పుడే ఓ గుర్తు తెలియని వ్యక్తి అటుగా రావడంతో వారు పారిపోయారు. ఆ వ్యక్తి అంబులెన్స్‌కు కాల్ చేయడంతో.. ఘటనాస్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపాడు.
తనపై హత్యాయత్నం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒకసారి ఆహారంలో విషం కలిపి ఇచ్చిందని రాజీవ్ బోరున విలపించాడు. అప్పుడే సాధన కుటుంబ సభ్యులకు తెలిపాను. కానీ ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేదు. సాధన తన నుంచి విడాకులు కోరుకుంటుంది. కానీ తాను ఆమెతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని రాజీవ్ పేర్కొన్నాడు. రాజీవ్ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో డాక్టర్‌కు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.