బావిలో పడిన సింహం…రెస్క్యూ ఆపరేషన్ వైరల్ !

గుజరాత్‌లో బావిలో పడిన ఆసియా సింహాన్ని అటవీ అధికారులు గంటపాటు శ్రమించి సురక్షితంగా రక్షించారు. ఈ రెస్క్యూ వీడియో వైరల్‌గా మారింది.

బావిలో పడిన సింహం…రెస్క్యూ ఆపరేషన్ వైరల్ !

విధాత : అడవికి రారాజు మృగరాజు సింహం ఆపదలో పడిపోయింది. ఆహారం కోసం ఓ జంతువును వేటాడే క్రమంలో ఆసియా సింహం అనుకోకుండా 15 అడుగుల లోతు ఉన్న బావిలో పడి సహాయం కోసం ప్రాణాపాయంతో విలవిలాడింది.
గుజరాత్‌లోని ఉనాలో జంతువును వేటాడే క్రమంలో సింహం నియంత్రణ కోల్పోయి నీటితో నిండిన వ్యవసాయ బావిలో పడిపోయింది. బావిలో పడిన మృగరాజు గర్జనల శబ్దాలు విన్న స్థానిక రైతులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సింహాన్ని కాపాడటానికి గంటకు పైగా శ్రమించారు.

బావిలో పడి భయపడిపోయిన సింహం తనను రక్షించేందుకు అటవీ అధికారులు బిగించిన రక్షణ తాడులను కొరికి తెంచడంతో, బృందాలు తమ వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చింది. తాళ్లతో వేసిన ఉచ్చును, బావి అంచున ఉంచిన బోనును ఉపయోగించి, వారు చివరకు దాన్ని ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా పైకి తీశారు. బావి నుంచి సింహాన్ని పైకిలాగి సరాసరి బావి అంచున ఏర్పాటు చేసిన బోను వద్దకు చేర్చగా అది అందులోకి దూరింది. బోనులో చిక్కిన సింహాన్ని అటవీ అధికారులు తిరిగి సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించారు.

గుజరాత్‌లో సింహాల ఆవాసాల సమీపంలో ఇప్పటికీ వేలాది మూతలేని బావులు ఉన్నాయి. వీటిలో తరచూ సింహాలు, ఏనుగులు సహా ఇతర వన్యప్రాణులు పడిపోవడం సమస్యగా తయారైంది. చాలసార్లు సహాయక బృందాలు వాటిని రక్షిస్తున్నప్పటికి..మరికొన్ని వాటిలో పడి చనిపోతున్నాయి. వన్యప్రాణుల ప్రాణ నష్టం నివారణకు ఒపెన్ వెల్స్ పై కప్పులు నిర్మించేందుకు ప్రభుత్వం కూడా తన వంతుగా రైతులకు సహాయం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌గా ఏపీ : సీఎం చంద్రబాబు
పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్.. !