బోరుబావికి ‘అంత్యక్రియలు’..వైరల్ వీడియో
తమిళనాడులో మూడు ఏళ్లుగా పనిచేయని బోరుబావికి మహిళలు పూలమాలలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. తాగునీటి సమస్యపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ వినూత్న ఆందోళన చేపట్టారు.
అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా ఉండిపోయిన బోరుబావికి మహిళలు అంత్యక్రియలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా, ఎల్లైత్తరప్పట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని బోరు బావి గత మూడు సంవత్సరాల నుంచి నీళ్లు రాక.. నిరూపయోగంగా పడి ఉంది. బోరుబావి పనిచేయకపోవడంతో మహిళలు 5 కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకుంటు తిప్పలు పడుతున్నారు. బోరును ప్రెషింగ్ చేసి..కొత్త మోటార్ బిగించి ఉపయోగంలోకి తేవాలని గ్రామస్తులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు.
వారి నీటి సమస్యను అధికారులుఎంతకూ పట్టించుకోకపోవడంతో.. విసుగెత్తిపోయిన మహిళలు నిరుపయోగంగా ఉన్న బోరుబావికి పూలమాలలు వేసి అంత్యక్రియల తంతు నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఇలాగైన తమ మంచినీటి సమస్య ప్రభుత్వం దృష్టికి వెలుతుందన్న ఆలోచనతో మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపినట్లుగా వెల్లడించారు.
బోరుబావికి ‘అంత్యక్రియలు’ నిర్వహించిన మహిళలు
తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా, ఎల్లైత్తరప్పట్టి గ్రామంలో వెలుగు చూసిన ఘటన
గత మూడు సంవత్సరాల నుంచి నీళ్లు రాక.. నిరూపయోగంగా పడి ఉన్న బోరుబావి
ఎంత చెప్పినా అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో.. విసుగెత్తిపోయిన మహిళలు
దీంతో..… pic.twitter.com/DRlIALSJLy
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 25, 2026
ఇవి కూడా చదవండి :
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నాయకుల భేటీ
మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram