ఓటింగ్ వేళ… మహిళా రిజర్వేషన్ బిల్లులో మార్పులు?

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ తో కూడిన 131రాజ్యాంగ సవరణ బిల్లును మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదింపచేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నానాపాట్లు పడుతుంది. సాయంత్రం 4గంటలకు బిల్లుపై ఓటింగ్ ఉండటంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఓటింగ్ కు ముందు అనూహ్య భేటీలు, చర్చలు కొనసాగుతున్నాయి.

ఓటింగ్ వేళ… మహిళా రిజర్వేషన్ బిల్లులో మార్పులు?

విధాత: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ తో కూడిన 131రాజ్యాంగ సవరణ బిల్లును మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదింపచేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నానాపాట్లు పడుతుంది. సాయంత్రం 4గంటలకు బిల్లుపై ఓటింగ్ ఉండటంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠత కొనసాగుతుంది.

విపక్షాల బిల్లును వ్యతిరేకిస్తుండటం..సొంతంగా తగిన మాద్దతు లేకపోవడంతో బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం అన్ని మార్గాలు వెతుకుతుంది. విపక్షాలను ఒప్పించే దిశగా.. బిల్లులో మార్పులు చేసి, కొత్త రూపంలో బిల్లును తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై సీనియర్ మంత్రులతో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక చర్చలు కొనసాగిస్తున్నారు. విపక్షాలతో కేంద్ర మంత్రి కిరణ్ రీజుజు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరో అరగంటలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

అటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోసం సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కిరణ్ రిజుజు భేటీ కావడం ఆసక్తి రేపుతుంది. అయితే ఈ బిల్లును ఓడిస్తామని విపక్ష ఇండియా కూటమి నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించడం మరింత ఆసక్తి రేపుతుంది.

బిల్లును ఆమోదించండి : విపక్షాలకు ప్రధాని మోదీ వినతి

మరికొన్ని గంటల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ జరుగనున్న తరుణంలో బిల్లును ఆమోదించాలని కోరుతూ ప్రధాన మోదీ విపక్షాలను ఎక్స్ వేదికగా కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండని, ఆలోచించి ఓటు వేయండని, 40ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం వేచి చూస్తున్నారని, మహిళలకు హక్కులు కల్పించాల్సిన సమయం వచ్చిందని మోదీ పేర్కొన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీయకండని, బిల్లును ఆమోదించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీలో మల్లారెడ్డి కోడలు..ప్రధాని మోదీతో భేటీ!
సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం