44 వేలకు చేరిన కొత్త కేసులు..
విధాత: దేశంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి 40వేల పైనే రోజువారీ కేసులు వెలుగుచూశాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క కేరళ, ఈశాన్య రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కలవరానికి గురిచేస్తోంది. తాజాగా 18,16,277 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..44,230 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.15 కోట్లకు చేరాయి. నిన్న 555 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 4,23,217 […]

విధాత: దేశంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరోసారి 40వేల పైనే రోజువారీ కేసులు వెలుగుచూశాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క కేరళ, ఈశాన్య రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కలవరానికి గురిచేస్తోంది.
తాజాగా 18,16,277 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..44,230 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.15 కోట్లకు చేరాయి. నిన్న 555 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 4,23,217 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం 4,05,155మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 42,360 మంది కోలుకోగా.. మొత్తంగా 3.07 కోట్ల మంది వైరస్‌ను జయించారు. మరోపక్క నిన్న 51,83,180 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు 45,60,33,754గా ఉన్నాయి.