Keerthy Suresh: మ‌రోసారి ట్రెండింగ్‌లో.. కీర్తి

  • By: sr    news    Feb 16, 2025 10:08 AM IST
Keerthy Suresh: మ‌రోసారి ట్రెండింగ్‌లో.. కీర్తి

Keerthy Suresh:

విధాత‌: గ‌త డిసెంబ‌ర్‌లో త‌న చిర‌కాల మిత్రుడు, ప్రియుడు అంటోని త‌ట్టిల్‌ను పెళ్లి చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టింది కేర‌ళ కుట్టి, మ‌హాన‌టి కీర్తి సురేశ్ (Keerthy Suresh). పెళ్లి అనంత‌రం సినిమాల‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వ‌కుండా వ‌రుస చిత్రాల‌కు సైన్ చేస్తోంది.

ఇప్ప‌టికే కీర్తి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన బేబీ జాన్ థియేట‌ర్ల‌లోకి రాగా త్వ‌ర‌లో అక్క అంటూ ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది.

అయితే పెళ్లికి ముందు గ్లామ‌ర్‌కు, వ‌స్త‌ధార‌ణ‌లో ప‌ద్ద‌తిగా ఉంటూ వ‌చ్చిన కీర్తి Keerthy Suresh పెళ్లి త‌ర్వాత మాత్రం త‌న డ్రెస్సింగ్‌లో పూర్తిగా రూట్ మార్చేసింది. నిత్యం ఏదో ఫొటోషూట్‌లో సంద‌డి చేస్తూ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తోంది.

తాజాగా త‌న పెళ్లినాటి ఫోటోల‌ను సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.