Ap government: వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వం జీవో

Ap government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది.
అయితే గత ముఖ్యమంత్రి జగన్ హయాంలో వైఎస్సార్ కడప జిల్లా నుంచి కడప అనే పేరును తీసేసి కేవలం వైఎస్సార్ జిల్లాగా మర్చారు. తాజాగా ప్రభుత్వం పాత పేరును పునరుద్ధరించింది. కాగా ప్రభుత్వం నిర్ణయాన్ని వైసీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పేరు మార్చారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.