Narayana: బ్లీచింగ్కి కూడా డబ్బులు లేవు: ఏపీ మంత్రి నారాయణ

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి నారాయణ (Narayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని.. మున్సిపాలిటీల్లో బ్లీచింగ్కి కూడా డబ్బులు లేవని నారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందని నారాయణ (Narayana) చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మూడు రాజధానులు అని మూడు ముక్కల ఆట ఆడిందన్నారు. ఎన్నికల కోడ్ తో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని.. మూడేళ్లలో రాజధాని కడుతామన్నారు. ఘోస్ట్ రాజధాని అని వైసీసీ పిచ్చి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఈ నెల 12నుంచి 15మధ్య అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. మొదటి దశలో 40వేల కోట్లతో పనులు ప్రారంభమవుతాయన్నారు. త్వరలో మహిళలకు ఉచిం బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు.