బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం గుండెపోటుతో మృతి

విధాత‌: బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం(66) గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్​లో గుండెపోటుతో కుప్పకూలారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరుకు చెందిన మనోహరం అక్కడే ఏసీ సుబ్బారెడ్డి రీడింగ్‌ రూమ్‌ యూత్‌ సెంటర్​ ఏర్పాటుచేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. ఎంతో మందిని బాల్‌బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో జాతీయస్థాయికి తీసుకెళ్లారు. తోట శంకరమ్మ మహిళా సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టులో […]

బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం గుండెపోటుతో మృతి

విధాత‌: బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం(66) గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్​లో గుండెపోటుతో కుప్పకూలారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరుకు చెందిన మనోహరం అక్కడే ఏసీ సుబ్బారెడ్డి రీడింగ్‌ రూమ్‌ యూత్‌ సెంటర్​ ఏర్పాటుచేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు.

ఎంతో మందిని బాల్‌బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో జాతీయస్థాయికి తీసుకెళ్లారు. తోట శంకరమ్మ మహిళా సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టులో శిక్షణ ఇచ్చారు. మహిళా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.