AP Jethwani Case | జత్వానీ కేసులో.. IPS కాంతిరాణా, విశాల్ గున్నీలకు CID నోటీసులు

  • By: sr    news    Apr 30, 2025 3:01 PM IST
AP Jethwani Case | జత్వానీ కేసులో.. IPS కాంతిరాణా, విశాల్ గున్నీలకు CID నోటీసులు

AP Jethwani Case |

విధాత: సినీ నటి జత్వానీ కేసులో ఏపీ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. జత్వానీ కేసులో మే 5న విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స మాజీ చీఫ్ ఎస్ఆర్. అంజనేయులును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. కోర్టు కస్టడీతో విచారణ చేశారు.

ఈ కేసులో గతంలో కాంతిరాణా, విశాల్ గన్నీలను సీఐడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా నటి జత్వానీ అరెస్టు..నిర్భంధం అంశాలలపై వారిద్ధరు వెల్లడించిన అంశాలకు..తాజాగా పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించిన సందర్భంలో చెప్పిన జవాబులకు ఎక్కడ పొంతన కుదరడం లేదని సీఐడీ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో కాంతిరాణా, విశాల్ గున్నీలను మళ్లీ పిలిచి విచారించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. దీంతో వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు.