Viral: మొక్కజొన్నపై.. కోబ్రా దర్జా! (వీడియో)

Viral | Cobra
విధాత: ఓ రైతు మొక్కజొన్న దిగుబడులపై దర్జాగా పడగవిప్పి దర్పం ఒలకబోసిన కోబ్రా అనూహ్యంగా పాములోడి చేతికి చిక్కిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిజానికి కోబ్రాలు (తాచు పాములు), కింగ్ కోబ్రాలు(గిరి నాగులు) నాగ స్వరానికి స్పందిస్తాయో లేదో తెలియదుకాని..గతంలో పాములు ఆడించేవారు మాత్రం నాగస్వరం ఊది పాములు ఆడినట్లుగా చూపించే వారు. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ రైతు తన మొక్కజొన్న దిగుబడులను మార్కెట్ కు తరలించే ప్రయత్నంలో ఉండగా..వాటిపై ఓ కోబ్రా పడగ విప్పి రైతును భయపెట్టేసింది.
భారీ సెక్యూరిటీ #viralvideo #snake pic.twitter.com/KKKFcjEZKW
— srk (@srk9484) June 3, 2025
అదే సమయంలో అటుగా వెలుతున్న పాములోడిని చూసిన రైతు పాము సంగతి చూడమని పిలిచాడు. ఇంకేముంది మనోడు తన నాగస్వరం బూరను ఊదుగూ కోబ్రా దృష్టి మళ్లించి దాన్ని లాఘవంగా పట్టేసి తన బుట్టలో వేసుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే అదంతా ముందస్తుగా రీల్స్ కోసం ప్లాన్ చేసిన వీడియో గా వ్యవహారంగా మరికొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియోను ఓ లుక్ వేయండి మరి. ఇటీవల కొందరు ఆకతాయిలు ఓ పాము పుట్ట వద్ద చెట్టుకు టేప్ రికార్డర్ ను అమర్చి నాగస్వరం పాటను వినిపించగా..పుట్టలోంచి పాము బయటకు వచ్చి పడగవిప్పి కొద్ధిసేపు నాట్యమాడిన వీడియో కూడా చూశాం. సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా రీల్స్ వీడియోలు విరివిగా వస్తుండటంతో ఏది నిజమో ఏదీ అబద్దమో తెలియకుండా పోతుంది.
భారీ సెక్యూరిటీ #viralvideo #snake pic.twitter.com/KKKFcjEZKW
— srk (@srk9484) June 3, 2025