Horoscope | 13.01.2025 సోమవారం.. భోగి పండుగ రోజు రాశి ఫలాలు! ఆ రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

  • By: sr    news    Jan 13, 2025 10:11 AM IST
Horoscope | 13.01.2025 సోమవారం.. భోగి పండుగ రోజు రాశి ఫలాలు! ఆ రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నుంచి చెర‌గ‌ని నమ్మకం. లేచిన స‌మ‌యం నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల పేర‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం
వాయిదా ప‌డ్డ‌ పనులు పూర్తవుతాయి. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసికమైన‌ ఆనందం క‌లుగుతుంది. చెప్పుకోత‌గ్గ‌ పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మికంగా ధన రూపేన లాభం చేకూరుతుంది. శుభవార్తలు విన‌డ‌మే కాక‌, త‌ల‌పెట్టిన‌ శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి కూడా సాధిస్తారు.

వృషభం
ఆర్థికప‌ర‌మైన‌ ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో కొద్దిపాటి మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాలు జారవిడుచుకుంటారు. ఆకస్మికంగా ధన నష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది.. జాగ్ర‌త్త‌ అవసరం. దూరపు బంధువులు కలుస్తారు. వారితో లాభాలు చూకూరుతాయి.

మిథునం
త‌ల‌పెట్టిన అన్నికార్యాల్లో విజయం సాధిస్తారు, సౌఖ్యాన్నిపొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో, ఆకస్మిక ధనలాభం చూకూరుతుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. అయితే బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచిది.

కర్కాటకం
ప్ర‌తి విషయంలోనూ అస్థిర నిర్ణయాలే ఉంటాయి. కుటుంబ అంశాలపై అనాసక్తి ప్ర‌ద‌ర్శిస్తారు. గృహంలో మార్పు అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా జ‌రుగుతాయి. కొన్ని కార్యాలు త‌ప్ప‌క వాయిదా వేసుకుంటారు. ఆడ‌వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.

సింహం
త‌మ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనలు ఉంటాయి. వాటిని తొలగించడానికి దైవ ధ్యానం చేయాలి. శారీరక అనారోగ్యంతో బాధ పెడుతుంది. కుటుంబ విషయాల్లో అసంతృప్తి ఉంటుంది. వృధా ప్రయాణాలు, ధన వ్యయం అధిక‌మ‌వుతాయి. చెడు సహవాసాలతో గౌరవం పోతుంది. క్షణికావేశం పనికిరాదు.

న్య
తలచిన కార్యాల‌లో ఆటంకాలువ‌స్తాయి. స్థిరాస్తుల సమస్యలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం అవుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకుండా దూరంగా ఉండాలి. ప్రయాణాలు అధిక‌మ‌వుతాయి. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. శతృబాధలు దూరం అవుతాయి.

తుల
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. చేసే ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం వ‌రిస్తుంది. శుభవార్తలు విన‌డ‌మే కాక‌, చేసే ప‌నుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనయోగం ఉంటుంది. మ‌న‌సు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

horoscope-

వృశ్చికం
అనారోగ్య స‌మ‌స్య‌లతో సతమతం అవుతారు. స్థానచలన సూచనలు క‌లుగుతాయి. కొత్త‌ వ్యక్తులను కలుస్తారు. కుటుంబ విష‌యంలో అసంతృప్తితో మానసిక ఆందోళన ప‌డ‌తుంటారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొల‌గుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు

వ్య‌క్తిగ‌త వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల విష‌యంలో చాలా జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను సైతం కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు.

మకరం
సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం చేరూరుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రతి విషయంలోనూ వృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. అనుకూలమైన‌ స్థానచలనం అవకాశాలు ఉంటాయి.

కుంభం
కొత్త‌ వ్యక్తుల పరిచయం జ‌రుగుతుంది. గౌరవ మర్యాదల్లో లోటు ఉండదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కాక‌పోతే అనవసర వ్యయప్రయాసలు, వృధా ప్రయాణాలు ఎక్కువగా అవుతాయి. మానసిక ఆందోళనల‌తో కాలం వెళ్ల‌దీస్తారు. బంధుమిత్రులతో గోడ‌వ‌లు, స్థిరాస్తుల విషయంలో ఏర్పడకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. శారీరకంగా బలహీనమ‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఓ అద్భుత అవకాశాన్ని సైతం కోల్పోతారు.

మీనం
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల వ‌ళ్ల‌ లాభంచేకూరుతుంది. మంచి ఆలోచనలతో ఉంటారు. బంధు, మిత్రులు అమితంగా గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. సత్కార్యాల్లో పాల్గొన‌డ‌మే కాక‌, గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. త‌ల‌పెట్టిన కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని ఇస్తాయి.