Daily Horoscope | జనవరి 22, బుధవారం.. మీ రాశి ఫలాలు! వారికి ప్రయాణాలు అధికం

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
మేషం (Aries) :
ఈ రాశి వారు మానసిక ఆందోళన ఉంటుంది. వృత్తి రీత్యా వచ్చే ఇబ్బందులు దాటుతారు. స్త్రీల వ్యవహారాల్లో సమస్యలు. ఆకస్మిక ధననష్టం అవకాశం. శత్రువులతో జాగ్రత్త అవసరం. ఉత్సాహంగా ఉండాలి.
వృషభం (Taurus) :
ఆకస్మిక ధననష్టం అవకాశాలు. స్థిరాస్తుల విషయంలో అజాగ్రత్త వద్దు. ఇతరుల మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
మిథునం (Gemini) :
సంతృప్తిగా కుటుంబ పరస్థితులు. ఆకస్మిక ధననష్టం అవకాశం. వృధా ప్రయాణాలు ఎక్కువ. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఓపికతో ఉండాలి.
కర్కాటకం (Cancer) :
కుటుంబ విషయాలలో అసక్తి కనబర్చరు. ఇంటిలో మార్పుల అవకాశాలు. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (Leo) :
అనారోగ్యం సమస్యలు ఎక్కువవుతాయి. ఏ కారణం లేకుండానే కలహాలు. అనవసర భయాలు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు పిల్లల విషయంలో శ్రద్ధగా ఉంటారు.
కన్య (Virgo) :
మానసిక ఆందోళనలు పోతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భయాలు దూరమవుతాయి. ప్రయాణాల విషయంలో తెలివిగా ఉండాలి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యం.
తుల (Libra) :
ప్రయాణాలు అధికం. స్థానచలనం అవకాశాలు. రుణ లాభం పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. ఎలర్జీతో బాధ పడేవారు అప్రమత్తత అవసరం. ప్రయత్నాలకు ఆటంకాలు.
వృశ్చికం (Scorpio) :
అనారోగ్య బాసమస్యలతో సతమతమతం. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఇంటి విషయంలో మార్పులు కావాలనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం.
ధనుస్సు (Sagittarius) :
ఆకస్మిక ధననష్టం. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. మానసిక ఆందోళనలు. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి.
మకరం (Capricorn) :
స్త్రీల ఆధారంగా లాభాలు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం. కుటుంబం సంతోషంగా ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. ఫంక్షన్లలో పాల్గొంటారు.
కుంభం (Aquarius) :
ప్రయాణాలు అధికంగా చేయాల్సి ఉంటుంది. అనవసర డబ్బు ఖర్చుతో ఆందోళన. విదేశియాన ప్రయత్నాలు సుగమం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తప్పక ఉంచాలి.
మీనం (Pisces) :
వృత్తి, ఉద్యోగ రంగాల్లో వృద్ధి ఆలస్యం. ఆకస్మిక ధననష్టం అవకాశాలు. అస్థిరమైన నిర్ణయాలు. ఆపదల్లో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. గౌరవ మర్యాదల విషయంలో భంగం వాటిల్లకుండా జాగ్రత్త అసరం.