Viral: ఇదెక్క‌డి పామురా.. త‌న‌ను తానే తినేస్తుంది (వీడియో)

  • By: sr    news    Jun 01, 2025 8:48 AM IST
Viral: ఇదెక్క‌డి పామురా.. త‌న‌ను తానే తినేస్తుంది (వీడియో)

Viral:  విధాత: సృష్టిలోని అనంత ప్రాణికోటికి వాటి మనుగడకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక జీవన శైలి కలిగి ఉండటం తెలిసిందే.. చిన్న చేపలను పెద్ద చేపలను తినడం..భారీ జీవులు చిరు ప్రాణులను వేటాడి ఆహారంగా స్వీకరించడం సహాజమే. కొన్ని ప్రాణులు తమ సంతానాన్ని కూడా ఆహారంగా తీసుకునే అరుదైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓ పాము ఏకంగా తన శరీరాన్నే తన ఆహారంగా మలుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఓ పాము ఎందుకో మరి.. తనకు తీవ్ర ఆకలితో ఉందా..లేక..మరేదైనా కారణమా..లేక..వాటి జీవన శైలి ప్రక్రియలో భాగమా తెలియదు కాని.. తన శరీరంలోని తోక వైపు భాగాన్ని క్రమంగా మింగేయడం మొదలు పెట్టింది. అలా తన శరీరంలోని సగ భాగం మింగేసింది. ఆ పాము ఎందుకలా చేసిందన్నది పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పుడు దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆకలిని అధిగమించే ఎత్తుగడలో ఆ పాము అలాంటి ప్రక్రియకు పూనుకోవచ్చని కొందరు..ఆ పాము అనారోగ్యాన్ని సరిచేసుకునే క్రమంలో తన శరీర భాగాన్ని ఉదరంలోకి మింగి ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా పాము తనను తాను మింగేసుకున్న వీడియో వైరల్ గా మారింది.