Elephants | పార్వతీపురంలో.. ఏనుగుల గుంపు బీభత్సం! ఇండ్లు, బండ్లపై దాడి

Elephants | Parvathipuram | Manyam District
విధాత: ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురంలో ఓ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చి పొలాలు, తోటలలో విహారం చేస్తూ రైతుల పాకలు, కంచెలను ధ్వంసం చేస్తూ రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల గుంపు వాహనదారులపై దాడికి పాల్పడ్డాయి.
చింతపండు లోడుతో వెళ్తున్న లారీపై దాడి చేసిన ఏనుగులు లారీ అద్దాలు ధ్వంసం చేయడంతో భయంతో అందులోని డ్రైవర్, సిబ్బంది పరుగులు తీశారు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఆ మార్గంలోని మిగతా వాహనదారులు భయంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. ఏనుగుల గుంపు రోడ్డు దిగి పోలాల బాట పట్టాక వాహనదారులు ముందుకు కదిలారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అడవి దారి పట్టించేందుకు శ్రమిస్తున్నారు. పార్వతిపురం ఏజన్సీ గ్రామాల్లో తరుచు ఏనుగుల గుంపులు దాడికి పాల్పడుతుండంతో రైతులు, ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది.