OTTలో అదిరిపోయే తెలుగు సైక‌లాజిక‌ల్, ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌.. ఎందులో అంటే

  • By: sr    news    Jan 17, 2025 6:32 AM IST
OTTలో అదిరిపోయే తెలుగు సైక‌లాజిక‌ల్, ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌.. ఎందులో అంటే

విధాత‌: ఇటీవ‌ల సైలెంట్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఓ చిత్రం కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటుంది. అయితే ఇలాంటి సినిమా మ‌న తెలుగులో ఉంద‌ని ఇలాంటి త‌ర‌మా చిత్రం తీశారంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మే. కానీ సినిమా చూస్తూ పోతే మీకు ఈ అభిప్రాయం రాక మాన‌దు. ఇంత‌కు ఆ చిత్రం పేరేంటంటే హైడ్ అండ్ సీక్ (Hide N Seek). గ‌త డిసెంబర్‌లో థ‌యేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ క్రైమ్‌, సైక‌లాజిక‌ల్‌, ఇన్వెస్టిగేష‌న్‌ చిత్రం అంత‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు గానీ ఇప్పుడు ఓటీటీకి వ‌చ్చాక ఎలా మిస్ అయ్యామ‌ని అనుకునేలా చేస్తుంది. వంద‌ల కోట్టు పెట్టి ఊసురు మ‌నిపించే సినిమాల క‌న్నా ఈ సినిమా బావుందంటూ ఫ్యామిలా, ముఖ్యంగా లేడీస్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో వ‌చ్చిన మ‌న‌మంతా చిత్రంతో న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ (Viswant Duddumpudi) ఈ సినిమాలో హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాల్లో హీరోగా న‌టించినా గుర్తింపును మాత్రం ద‌క్కించుకోలేక‌పోయాడు. ఈ సినిమాకు బ‌సిరెడ్డి రానా (Basireddy Rana) ర‌చ‌న చేయ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా శిల్పా మంజునాథ్ (Shilpa Manjunath), రేహా స‌చ్‌దేవ్ (Rhea Sachdeva), ద‌యానంద్ రెడ్డి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. లియో కే జోష్ (Lijo K Jose) సంగీతం అందించ‌గా సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించాడు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. క‌ర్నూలు న‌గ‌రంలో ఓ మెడిక‌ల్ కాలేజీ స‌మీపంలో వ‌రుస హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. ఏస్సై వైష్ణ‌వి ఈ కేసుల‌ను ఇన్వెస్టిగేట్ చేస్తుండ‌గా అవ‌న్నీ సూసైడ్‌గా తేలుతాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అవి సూసైడ్స్ కావు హ‌త్య‌లు అంటూ పోలీస్ స్టేష‌న్‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఓ ఫైల్ పంపుతాడు. దీంతో షాక్ తిన్న పోలీసులు కేసును తిరిగి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తారు. మ‌రోవైపు చ‌నిపోయిన వారికి న్యాయం చేయాలంటూ శివ అనే మెడిక‌ల్ స్టూడెంట్ స్వ‌త‌హాగా కేసును ప‌రిశోధిస్తుంటాడు. తీరా చూస్తే త‌న చుట్టూ ఉన్న‌వారే హిప్నాటైజ్‌కు గురై ముందే సెల‌క్ట్ చేయ‌బ‌డ్డ వ్య‌క్తిని చంపుతుంటారు. అయితే ఈ హ‌త్య‌లు శివ చేస్తున్నాడ‌ని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారు.

ఈ నేప‌థ్యంలో పోలీసుల నుంచి త‌ప్పించుకున్న శివ తిరిగి హ‌త్య‌ల వెనుక మిస్ట‌రీని చేధించే క్ర‌మంలో అనేక కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అస‌లు హ‌త్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయి, హిప్న‌టైజ్ చేసేది ఎవ‌రు, హ‌త్య‌ల‌కు మొబైల్ గేమ్‌కు ఉన్న లింక్ ఏంటి, చివ‌ర‌కు అస‌లు హంత‌కుడిని ప‌ట్టుకోగ‌లిగారా లేదా వంటి ఆక్తిక‌ర‌మైన క‌థ క‌థ‌నాలతో ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా సినిమా సాగుతూ ఆద్యంతం ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడీ చిత్రం ఆహా (Aha) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, మంచి ట్విస్టులు ఉన్న సినిమా చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ హైడ్ అండ్ సీక్ (Hide N Seek) సినిమాను మిస్స‌వుకుండా చూసి ఎంజాయ్ చేయండి.