Hyderabad: ఏటీఎంలో దొంగనోట్లు.. ట్టిస్ట్ ఏంటంటే?

  • By: sr    news    Jun 28, 2025 10:13 PM IST
Hyderabad: ఏటీఎంలో దొంగనోట్లు.. ట్టిస్ట్ ఏంటంటే?

విధాత, హైదరాబాద్ : ప్రస్తుతం యూపీఐ పేమేంట్ సిస్టమ్ వచ్చి నగదు లావాదేవీలు తక్కువయ్యాయి. అయినా, నకిలీ నోట్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి నిదర్శనం ఏటీఎంలోనే దొంగ నోట్లు రావడం. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రముఖ బ్యాంకులో జరిగింది. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేద్దామని వెళ్లిన బ్యాంకు ఉద్యోగులకు ఏటీఎంలో నకిలీ నోట్లు రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

దీంతో ఆ బ్యాంకు మేనేజర్ కు ఉద్యోగుల ఫిర్యాదు చేశారు. ట్విస్ట్ ఏంటంటే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఏటీఎంలోకి వచ్చి క్యాష్ డిపాజిట్ చేసినట్లు సీసీ టీవీలో పరీక్షిస్తే అర్థమయింది. ఈ సంఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం వెతుకుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఏటీఎంలో డబ్బులు తీసేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.