టైగర్ 3 క్రాకర్స్‌..థియేటర్లో బాణాసంచాలు కాల్చుతూ సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ

మహారాష్ట్ర లోని మాలెగాంలో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ టైగర్ 3 సినిమా చూస్తూ బాణసంచా కాల్చి హల్‌చల్ చేశారు

  • Publish Date - November 13, 2023 / 09:42 AM IST

Fans of Salman Khan’ Tiger 3 fear for their lives as a cracker explodes in the theatre.



మాలేగాం: మహారాష్ట్ర లోని మాలెగాంలో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ టైగర్ 3 సినిమా చూస్తూ బాణసంచా కాల్చి హల్‌చల్ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా టైగర్ 3 యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది. ఇమ్రాన్ అశ్వి కీలక పాత్ర చేశారు.


సల్మాన్, కత్రీనా ల కాంబోలో 2017లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం టైగర్ జిందా హై కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ఆదివారం నవంబర్ 12న టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. టైగర్ 3 సినిమా విడుదల కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన సల్మాన్ ఖాన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల ముందు భారీ కటౌట్లు పెద్ద ఎత్తున పెట్టి వాటితోపాటు బాణాసంచాలు కూడా కాల్చుతూ థియేటర్ లోపల, బయట నాన్న హంగామా సృష్టించారు.


అక్కడితో ఆగకుండా కొందరు అతి ఉత్సాహంతో ఏకంగా థియేటర్ లోపల కూడా పటాకులు పేల్చారు. మహారాష్ట్ర మాలేగాంలోని మోహన్ సినిమా ధియేటర్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అభిమానులు థియేటర్లో బాణాసంచా కాల్చడంపై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎందుకంటే పొరపాటున ఆ టపాకాయల నిప్పు సీట్లకు, లేదా కార్పెట్‌లకు తగిలి నిప్పు అంటుకుంటే మంటలు చెలరేగడం ఖాయమని, దానితో థియేటర్లో మొత్తం మంటలు వ్యాపిస్తాయని ఎగ్జిట్ సిస్టం దెబ్బతింటుందని అప్పుడు థియేటర్ లోపల పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని టెక్నీషియన్లు అంటున్నారు. అదే జరిగితే ఇక ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు.


ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లో బాణాసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినా కొందరు ఆయా హీరోలా ఫ్యాన్సు పటాకాలు కాల్చుతూ హంగామా సృష్టిస్తున్నారు. వీటిని వెంటనే అరికట్టకపోతే ఏదో ఒక సందర్భంలో పెద్ద ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి.