స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

విధాత: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి తెలంగాణ జన సమితి కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మార్జున్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సూర్యాపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలలో విద్యావంతులైన నిజాయితీపరులైన యువకులను రాజకీయాలకు తీసుకొచ్చి వారిని ప్రోత్సహించి ఎన్నికల్లో నిలబెట్టాలని ఆయన పార్టీ నాయకులను కోరారు.
నేటి పరిస్థితుల్లో రాజకీయాలు కొంతమంది చేతిలోనే బందీ అయిపోయి డబ్బులు మద్యం పంచడమే ఎ జెండాగా నడుస్తుందని వీటికి భయపడి విద్యావంతులయిన యువకులు రాజకీయాలకు దూరంగా పారిపోతున్న పరిస్థితి ఉన్నదని ఈ పరిస్థితిని మార్చుట కొరకు జన సమితి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. గ్రామాలలో నిత్య పైరవీకారులు వివిధ దాన్ధాలు చేసే వ్యక్తులు ఎన్నికలను గందరగోళపరుస్తూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారని వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండి నిరంతరం ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాల్లో ముందుండాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్. పార్టీ జిల్లా కార్యద్శి బొడ్డు కిరణ్ గౌడ్ ,రైతు జన సమితి జిల్లా అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి , ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకురి గోపి ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, పెంపహాడ్ మండల కన్వీనర్ పాను గోత్ సూర్యనారాయణ , చివ్వేమ్ల మండల పార్టీ అధ్యక్షులు సుమన్ నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, సూర్యాపేట మండల కోఆర్డినేటర్ ఏనుగు మదుసూధన్ రెడ్డి ,యువజన సమితి నియోజకవర్గ కన్వీనర్ బానోత్ సైదా నాయక్, పార్టీ జిల్లా నాయకులు మల్సూర్ పట్టణ ఎస్టీ సెల్ కన్వీనర్ దేవత సతీష్ మైనార్టీ సెల్ నాయకులు ఫరీద్ పాల్గొన్నారు.