gulzar house fire accedent | హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. గుల్జార్ హౌస్ కు మంటలంటుకొని 16 మంది దుర్మరణం

- మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు సమాచారం
- 10 అగ్నిమాపక యాంత్రాలతో కొనసాగుతున్న రెస్క్యూ
మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం
అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడటం తనను కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయనిధి నుంచి 2 లక్షలు పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఇక క్షతగాత్రులకు రూ. 50 వేలు అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ప్రమాదంపై రాజకీయాలొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై రాజకీయాలు చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనపై విపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం సకాలంలో స్పందించిందని గుర్తు చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై తాను అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుననానని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించినట్టు చెప్పారు. ,పోలీసులు , ఫైర్ సిబ్బంది ఘటన స్థలంలోనే ఉండి రెస్క్యూ చేపడుతున్నారని పేర్కొన్నారు. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాదాన్ని తగ్గించారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రమాదాలు అనుకోకుండా వస్తాయని అధికారులు సకాలంలోనే స్పందించారని పేర్కొన్నారు.