రూ.135 వేయ‌వ‌ల‌సిన జరిమానా ని రూ.1635 వేశారు..!

విధాత‌: కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై ₹1635 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్‌, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా ₹1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా విధించార‌ని.. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ […]

రూ.135 వేయ‌వ‌ల‌సిన జరిమానా ని రూ.1635 వేశారు..!

విధాత‌: కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ బైకుపై వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై ₹1635 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్‌, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా ₹1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా విధించార‌ని.. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది. తిరిగివ్వాలని ఆదేశించింది.