Operation Sindoor: ఉగ్రస్థావరాలపై.. భారత్ దాడులు! జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా శిబిరాల ధ్వంసం

విధాత: పహల్గాం ఉగ్రదాడి కి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా భారత్ వైమానిక దాడికి పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడికి పాల్పడింది. ఉగ్ర స్థావరాలపై మిస్సైల్స్ వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేశాయి.. బిహల్ బహుల్పూర్, పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులలో . మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. అర్థరాత్రి 1.44కు దాడులు ప్రారంభించినట్లు ఎక్స్‌లో భారత సైన్యం పేర్కొంది. మొత్తం 9 ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ.. పాకిస్తాన్ లోని 4 ప్రాంతాలను.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 5 ప్రాంతాలను టార్గెట్ చేసింది.
ముజఫరాబాద్, కోట్లీ, బింబార్, గుల్ పూర్, మురిడ్కే, బహావల్ పూర్, సియాల్ కోట్, చాక్అమ్రూ ప్రాంతాలు టార్గెట్ చేసింది. బహల్పూర్ ఉగ్రవాద శిబిరాలలో 30 మంది మృతి చెందారు. మొత్తం తొమ్మిది స్థావరాలలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తుంది. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారత రక్షణ శాఖ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనట్లుగా తెలిపింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. దాడుల నేపథ్యంలో ముందస్తుజాగ్రత్తగా దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేశారు . ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేశారు. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఉగ్ర స్థావరాలపై దాడులను పలుదేశాలకు ప్రధాని మోడీ వివరించారు. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్రస్థావరాలపై దాడులను వివరించారు. భారత్ వైమానిక దాడులకు ప్రతి దాడులు చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. సరిహద్దుల వెంట పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు పార్క్ సైన్యం కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు పలువురు గాయపడ్డారు. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పి కొట్టింది. మరోవైపు ఉగ్రస్థావరాలను లక్ష్యంగా భారత్ జరిపిన దాడుల పట్ల పాకిస్తాన్ అతిగా స్పందించవద్దని మౌనంగా ఉండాలని అమెరికా ఆదేశానికి సూచించడం విశేషం.