Territorial Army: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ!

Territorial Army:
విధాత: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. సైనిక శక్తిని బలపేతం చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్ కు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
టెరిటోరియల్ ఆర్మీలో ఎవరుంటారు?
టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్-టైమ్ వాలంటీర్ల రిజర్వ్ ఫోర్స్. సాధారణ సమయాల్లో తమ పనులు చేసుకుంటూ, సైన్యానికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తారు. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరికి సైనికులతో సమాన ర్యాంకులుంటాయి. దేశంలో 50 వేల మంది వరకు గల ఈ సైన్యంలో సచిన్, ధోనీ, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులున్నట్లుగా సమాచారం.