IT RIDES: నిర్మాత‌ల‌పై కొన‌సాగుతున్న ఐటీ రైడ్స్‌.. టెన్షన్‌లో దిల్ రాజ్

  • By: sr    news    Jan 24, 2025 3:44 PM IST
IT RIDES: నిర్మాత‌ల‌పై కొన‌సాగుతున్న ఐటీ రైడ్స్‌.. టెన్షన్‌లో దిల్ రాజ్

విధాత‌: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట నాలుగో రోజు కూడా ఐటీ రైడ్స్ కొన‌సాగుతున్నాయి. మూడు రోజులుగా దిల్ రాజు తో పాటు ఆయ‌న కూతురు ఇండ్ల‌లోనూ త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు అక్క‌డ కొన్ని కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంత‌రం శుక్ర‌వారం నాలుగో రోజున శ్రీనగర్ కాలనీ లోని దిల్ రాజ్ కార్యాలయంలో ఐటీ సోదాలు ప్రారంభంచారు. ఈక్ర‌మంలో ఇంట్లో సీజ్ చేసిన డాక్యుమెంట్లు, కార్యాలయంలో డాక్యుమెంట్లను స‌రి పోల్చుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉదయం నుంచే దిల్ రాజ్ కాస్త టెన్షన్ గా ఉన్నట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. దిల్ రాజును ఇంటి నుంచి నేరుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఐటీ వాహనంలోనే అధికారులు తరలించినట్లు స‌మాచారం. అయితే ఈ సోదాల స‌మ‌యంలో దిల్ రాజ్ ప‌లుమార్లు ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగిన‌ట్లు తెలుస్తోంది.

దిల్ రాజ్ బ్యానర్‌కు వచ్చిన ఆదాయానికి చెల్లించిన వాటికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించ‌డంతో పాటు భారీ ఎత్తున నగదు తరలించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నట్లు వినికిడి. ఇది ఇంకా ఎంత దూరం పోతుంద‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

అదేవిధంగా మైత్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ య‌జ‌మానుల విష‌యంలోనూ ఐటీ అధికారులు ఇలాంటి ప‌ద్ద‌తినే పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఐటీ అధికారులు మైత్రీ నవీన్ ను ఇంటి నుంచి ఆఫీసుకు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోండ‌గా అక్క‌డ ఇప్ప‌టికే మ‌రో భాగస్వామి రవిశంకర్ ఉన్న‌ట్లు స‌మాచారం.