భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

ఎల్‌పీజీ  కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గింపు 14.2 కిలోల  వంట గ్యాస్‌ సిలిండర్ ధర యథాతథం విధాత,న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌పై రూ. 122 మేర తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  నిర్ణయించాయి. నేటి(జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే ఉండనుంది. వాణిజ్య సిలిండర్‌ ధర మే నెలలో కూడా తగ్గిన  విషయం తెలిందే. […]

భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

ల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గింపు

14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్ ధర యథాతథం

విధాత,న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌పై రూ. 122 మేర తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. నేటి(జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే ఉండనుంది.

వాణిజ్య సిలిండర్‌ ధర మే నెలలో కూడా తగ్గిన విషయం తెలిందే. తాజా సవరణతో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కి చేరింది. ముంబైలోరూ.1422కు, కోల్‌కతాలో రూ.1544కు, చెన్నైలో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇక 14 కేజీల గ్యాస్ సిలిండర్ ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 809గా ఉంది. . కోల్‌కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ. 809గానూ, చెన్నైలో రూ. 825గా హైదరాబాద్‌లో రూ. 861.50 గానూ ఉంది.