మ్యాక్స్ బూపాలో కొత్త ప్రమాద బీమా పాలసీ
విధాత: ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇచ్చే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని నివా బూపా (మ్యాక్స్ బూపా) హెల్త్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. ఇందులో పాలసీదారులు తమ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ బీమా పొందే వీలుంది. గరిష్ఠంగా ₹10 కోట్ల విలువ వరకూ పాలసీని ఎంచుకోవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారుడికి పాక్షిక శాశ్వత వైకల్యం ఏర్పడితే.. ప్రాథమిక పాలసీ విలువలో 2% (గరిష్ఠంగా ₹లక్ష) చెల్లిస్తుంది. ప్రమాదం అనంతరం మూడు నెలలపాటు పనిచేసేందుకు వీలు కాకపోతే.. పాలసీ […]

విధాత: ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇచ్చే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని నివా బూపా (మ్యాక్స్ బూపా) హెల్త్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. ఇందులో పాలసీదారులు తమ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ బీమా పొందే వీలుంది. గరిష్ఠంగా ₹10 కోట్ల విలువ వరకూ పాలసీని ఎంచుకోవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారుడికి పాక్షిక శాశ్వత వైకల్యం ఏర్పడితే.. ప్రాథమిక పాలసీ విలువలో 2% (గరిష్ఠంగా ₹లక్ష) చెల్లిస్తుంది. ప్రమాదం అనంతరం మూడు నెలలపాటు పనిచేసేందుకు వీలు కాకపోతే.. పాలసీ విలువలో 0.5% నెలనెలా చెల్లిస్తుంది. పాలసీదారుడు మరణించినప్పుడు పిల్లలకు ఆర్థిక భరోసాకు వీలుగా చదువు కోసం గరిష్ఠంగా ₹5లక్షల వరకూ, పెళ్లి ఖర్చుల కోసం ₹10లక్షల వరకూ పరిహారం ఇస్తుంది.