జస్టిస్ రమణ ప్రశ్నకు మేడసాని పద్యం
విధాత:చతుర్గుణిత అష్టావధానంలో భాగంగా మొదటి ప్రశ్నను జస్టిస్ రమణ వేశారు. ‘‘ఆది, సోమ, మంగళ, బుధ అనే పదాలను.. వారాల అర్థం తో కాకుండా, అన్యార్థంతో ప్రయోగిస్తూ.. కరోనా బారి నుంచి యావత్ ప్రపంచాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి రక్షించుగాకా అనే భావనతో ఒక పద్యం చెప్పండి’’ అని కోరారు. దానికి అవధాని మేడసాని మోహన్ వెంటనే సీస, తేటగీతులతో.. జస్టిస్ ఎన్వీ రమణ పేరును కూడా చేర్చి, అందరి ప్రశంసలు అందుకున్నారు.ఆ పద్యం..ఆదిత్య తేజుడై అలరు […]

విధాత:చతుర్గుణిత అష్టావధానంలో భాగంగా మొదటి ప్రశ్నను జస్టిస్ రమణ వేశారు. ‘‘ఆది, సోమ, మంగళ, బుధ అనే పదాలను.. వారాల అర్థం తో కాకుండా, అన్యార్థంతో ప్రయోగిస్తూ.. కరోనా బారి నుంచి యావత్ ప్రపంచాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి రక్షించుగాకా అనే భావనతో ఒక పద్యం చెప్పండి’’ అని కోరారు. దానికి అవధాని మేడసాని మోహన్ వెంటనే సీస, తేటగీతులతో.. జస్టిస్ ఎన్వీ రమణ పేరును కూడా చేర్చి, అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఆ పద్యం..
ఆదిత్య తేజుడై అలరు వేంకటపతికలి కరోనా నుండి కాచు మనల సోమామృత వికాస శోభామయంబుగా కోవిడ్ మహమ్మారి కూల్చు స్వామి మాహాత్మ్య దీప్తురోమంగళలన్నియుు స్వామి చూపులలోన సాగుచుండె విబుధ సంచయమెల్ల వేంచేసి వేంకటేశ్వర పాద పద్మాల సన్నుతింపరమ్య నూతన వేంకట రమణ విభవమఖిల దిక్ దిగంతముల అద్భుతముగమాన్యమై, ధన్యమై నేడు మలయుచుండతెలుగువాడి అదృష్టాల వెలుగులవుట.