వరంగల్‌లో కేటీఆర్ సుడిగాలి పర్యటన

  • By: Somu    news    Oct 06, 2023 7:17 AM IST
వరంగల్‌లో కేటీఆర్ సుడిగాలి పర్యటన
  • అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్లో చేరుకొని అక్కడినుండి రోడ్డు మార్గాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు.



 


మొదట 30 లక్షల వ్యయంతో చేసిన ఎన్ఐటి జంక్షన్ ను ప్రారంభించారు, ప్రగతి నగర్ లోని 15 బస్తీ దవాఖాన, ఎంఎల్డి , టెక్నాలజీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఆర్ టి సి బస్ స్టాండ్ కి భూమి పూజ, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ , వివిధ జంక్షన్ , పోలీస్ భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, కెసిఆర్ భవన్, డబుల్ బెడ్రూం,వరద ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు.


కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ , ఎమ్మెల్యే వినయ భాస్కర్, మండలి డిప్యూటీచైర్మన్ బండా ప్రకాష్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్య, జిల్లా అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.