ACB | ఏసీబీ వలలో మరో అధికారిణి

  • By: TAAZ    news    Jul 01, 2025 8:48 PM IST
ACB | ఏసీబీ వలలో మరో అధికారిణి

తెలంగాణలో అవినీతి అధికారుల ఆట కట్టించడంలో ఏసీబీ దూసుకుపోతుంది. రోజుకు ఒక్కరైనా అన్నట్లుగా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు. మంగళవారం మూసాపేట సర్కిల్-23 ఆస్తి పన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ ఎం. సునిత ఏసీబీ అధికారులకు లంచం సొమ్ముతో చిక్కారు. ఆస్తి మ్యుటేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి, దస్తావేజును ప్రాసెస్..ఇంటి ఆస్తి నిర్ధారణ చేయడానికి ఫిర్యాదుదారునుంచి రూ.30,000 లంచం తీసుకుంటూ సునిత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.