ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో పోలీసుల పహారాలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం.
సీఎం ఇంటి సమీపంలో యువకుడు ఆత్మహత్యయత్నం.స్పృహ కోల్పోయిన మరో మహిళ.ఉద్రిక్తంగా మారిన అమరారెడ్డి కాలనీ.విధాత:ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అమరారెడ్డి కాలనీలో ఇళ్లు తొలగింపుల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ కూల్చేసిన అధికారులు. మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు.ఒకరోజు ముందు తేదీతో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు నోటీసు ఇచ్చి వెంటనే కూల్చివేతకు సిద్ధమాయ్యరు. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నారు.వినకపోవడంతో ఆ ఇంట్లో ఉంటున్న వడిగిన నాని ప్రొక్లెయినర్‌కు అడ్డుగా పడుకున్నాడు.పోలీసులు వచ్చి […]

సీఎం ఇంటి సమీపంలో యువకుడు ఆత్మహత్యయత్నం.
స్పృహ కోల్పోయిన మరో మహిళ.
ఉద్రిక్తంగా మారిన అమరారెడ్డి కాలనీ.
విధాత:ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో అమరారెడ్డి కాలనీలో ఇళ్లు తొలగింపుల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ కూల్చేసిన అధికారులు. మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు.ఒకరోజు ముందు తేదీతో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు నోటీసు ఇచ్చి వెంటనే కూల్చివేతకు సిద్ధమాయ్యరు. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నారు.వినకపోవడంతో ఆ ఇంట్లో ఉంటున్న వడిగిన నాని ప్రొక్లెయినర్‌కు అడ్డుగా పడుకున్నాడు.పోలీసులు వచ్చి లాగేయడంతో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునే ప్రయత్నం చేశాడు.అతని సోదరి గుర్తించి కేకలు వేయడంతో పోలీసులు వెళ్లి తలుపులు తీసి అతన్ని బయటకు తీసుకొచ్చారు.అంతకుముందు అతని తల్లి రాజ్యలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.బాధితుల అరుపులు కేకలతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది.నోటీసు ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉంటున్న శివశ్రీ అనే యువతిని పోలీసులు పట్టుకెళ్లారు.