ఆక్సిజ‌న్ అంద‌కే వేల మ‌ర‌ణాలు… సిపిఐ

విధాత‌(అనంత‌పురం): కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయ‌కుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నార‌ని ఫలితంగా రాష్ట్రంలో వేల మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని సిపిఐ అనంత‌పురం జిల్లా నాయ‌కులు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదుట బుధవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నగర కార్యదర్శి శ్రీ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, […]

ఆక్సిజ‌న్ అంద‌కే వేల మ‌ర‌ణాలు… సిపిఐ

విధాత‌(అనంత‌పురం): కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయ‌కుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నార‌ని ఫలితంగా రాష్ట్రంలో వేల మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని సిపిఐ అనంత‌పురం జిల్లా నాయ‌కులు విమర్శించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదుట బుధవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నగర కార్యదర్శి శ్రీ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి, నాయకులు లింగమయ్య రాజారెడ్డి, రమణయ్య, రాజేష్ గౌడ్, చాంద్ బాషా, ఎల్లుట్ల నారాయణస్వామి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి తదితరులు హాజరయ్యారు.