Allu Arjun: పుష్ఫ.. మామయ్యల బాట

పుష్ఫ 2 సినిమా బెన్ఫిట్ షో తొక్కిసలాట కేసులో శనివారం మధ్యంతర బెయిల్‌పై విడుదలై ఇంటికివచ్చిన అల్లు అర్జున్‌కు సినిమా ప్రముఖులు రోజంతా క్యూకట్టి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
బన్నీ అరెస్టు విషయం తెలిసిన క్షణాల్లోనే షూటింగ్ రద్దు చేసుకుని అర్జున్ ఇంటికి వచ్చిన చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్‌కు ధైర్యం చెప్పి వెళ్లారు. తిరిగి అర్జున్ ఇంటికి వచ్చాక చిరంజీవి సతీమణి అర్జున్ను కలిసి భావోద్వేగానికి గురవగా చిరంజీవి బిజీ షెడ్యూల్‌తో రాలేకపోయారు.
ఈనేపథ్యంలో బన్నీ తన కుటుంబ సమేతంగా ఆదివారం మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా బాగోగులు తెలుసుకున్నాక కలిసి లంచ్ చేశారు. అనంతరం అరెస్టు, జైలు తదితర పరిణామాల గురించి మాట్లాడుకున్నారు.
అదేవిధంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి సాయంత్రం నాగబాబు ఇంటికి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా వీరిద్దరి అభిమానుల మధ్య జరుగుతున్న వార్ ఇంతటితో ముగిసినట్టే అని చర్చించుకుంటున్నారు.