రఘును ఒక కేసులో అదుపులోకి తీసుకున్నాం- మట్టపల్లి పోలీసులు
విధాత:తొలివెలుగు రిపోర్టర్ రఘును కిడ్నాప్ చేశారన్న వార్తలను పోలీసులు ఖండించారు. గుర్రంపోడు భూములను అధికార టిఆర్ ఎస్ నేతలు కబ్జా చేశారని అప్పట్లో బిజేపీ నాయకులు ఆందోళన చేశారు. రాజ్‌న్యూస్ రిపోర్టర్‌గా రఘు దానిని కవర్ చేసిన క్రమంలో నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. కానీ రఘుని మాత్రం ఏ-19గా పెట్టారు. ఈ కేసులో విచారించేందుకు ఈ రోజు రఘును అదుపులోకి తీసుకున్నట్లు […]

విధాత:తొలివెలుగు రిపోర్టర్ రఘును కిడ్నాప్ చేశారన్న వార్తలను పోలీసులు ఖండించారు. గుర్రంపోడు భూములను అధికార టిఆర్ ఎస్ నేతలు కబ్జా చేశారని అప్పట్లో బిజేపీ నాయకులు ఆందోళన చేశారు. రాజ్‌న్యూస్ రిపోర్టర్‌గా రఘు దానిని కవర్ చేసిన క్రమంలో నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. కానీ రఘుని మాత్రం ఏ-19గా పెట్టారు. ఈ కేసులో విచారించేందుకు ఈ రోజు రఘును అదుపులోకి తీసుకున్నట్లు మట్టపల్లి పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రఘు భార్యకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. కోర్టులో హాజరుపరిచాక రఘును రిమాండుకు పంపుతామని ఆ నోటీసుల్లో పోలీసులు తెలిపారు.